ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. గతంలో అగ్రరాజ్యం సహా పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరికలు చేశారు. దీంతో ప్రపంచ దేశాలు మరింత కలవరపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రపంచానికి మరో షాకింగ్ వార్త తెలిసింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ దేశంలో కొత్తరకం ‘ఒమిక్రాన్’ వేరియంట్ వెలుగు చూసిందని క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్యం, అంబులెన్సు సేవల శాఖ మంత్రి వైవెట్టా డియాత్ వెల్లడించారు.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. ‘ఒక కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు చెప్పడం కోసమే ఇక్కడ నేను నిలుచున్నా. ప్రపంచంలో ఈ కొత్తరకం వేరియంట్ కనిపించడం ఇదే తొలిసారి’ అని ఆమె ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ఆస్ట్రేలియాకు వచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్ కనిపించినట్లు తెలియజేశారు.
COVID-19 Update: The Queensland Health Minister @YvetteDAth is speaking in Brisbane. #covid19 https://t.co/h8hHrYFRW4
— Annastacia Palaszczuk (@AnnastaciaMP) December 7, 2021