హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌లోని హార్ట్ఫుల్నెస్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా శనివారం నుంచి 7వ జాతీయ సీనియర్ బ్మాడ్మింటన్ చాంపియన్‌షిప్ మొదలైంది. దేశంలోని పారా షట్లర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన టోర్నీలో వివిధ రాష్ర్టాల నుంచి 700 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. వీరిలో జాతీయ చాంపియన్లు, పారాలింపిక్ పతక విజేతలు ఉన్నారు. ఈనెల 9 తేదీ వరకు అర్హత రౌండ్లు, ప్రధాన మ్యాచ్‌లు జరుగనుండగా, 10న ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి జాతీయ పారా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.