పటియాల: ఇండియన్ ఓపెన్ త్రోస్ కాంపిటీషన్లో భారత స్టార్ అథ్లెట్ తజిందర్పాల్సింగ్ తూర్ పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ 20.51మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. ఏషియన్ గేమ్స్ స్వర్ణ విజేత అయిన తజిందర్ తనదైన శైలిలో సత్తాచాటాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఈ 31 ఏండ్ల అథ్లెట్ రెండు సార్లు 20.02మీ, 20.07మీటర్ల దూరం విసిరి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మూడేండ్ల క్రితం నెలకొల్పిన రికార్డు(21.17మీ)కు చేరువయ్యాడు. జపాన్ వేదికగా ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌లో రాణించడమే లక్ష్యంగా తజిందర్‌పాల్ ముందుకు సాగుతున్నాడు.