వైరా, ఆగస్టు 10 : ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ ట్రాలీ వాహనాన్ని ఫార్చునర్ కారు వెనుక నుండి ఢీకొంది. దీంతో అశోక్ లైలాండ్ మినీ ట్రాలీ వ్యాన్ పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం పోలీసులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

మినీ ట్రాలీని ఢీకొన్న ఫార్చనర్ కారు