Omicron | ఒమిక్రాన్ వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?

Omicron variant | రెండేండ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌గా రూపాంతరం చెంది దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పుడు మరోసారి భయపెట్టిస్తుంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదా? లేదా? అన్న అంశంపై ఒక వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ( AIG Chairman Dr.Nageshwar Reddy ) ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
అంత ప్రమాదకరమా?
ఒమిక్రాన్ సోకితే కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని.. అయితే ఈ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో ఒక్కరు కూడా మరణించలేదని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒమిక్రాన్ వేరియంట్ అంటే ఏంటి?
‘కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ కిందకు వస్తుంది. ఇలాంటి వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతంరం చెందినప్పుడే అవి మనుగడ సాధించగలుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వైరస్లు రూపాన్ని మార్చుకుంటుంది. దాన్నే ఉత్పరివర్తనం ( మ్యుటేషన్) అని పిలుస్తారు. తాజాగా కరోనా వైరస్ కూడా రూపం మార్చుకుని ఒమిక్రాన్ వేరియంట్‌గా మారింది’ అని డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు.
మ్యుటేషన్ మంచికేనా?
ఇలాంటి ఆర్ఎన్ఏ వైరస్లు రూపాంతరం చెందుతూ చెందుతూ క్రమంగా ప్రమాదరహితం అవుతాయని డాక్టర్ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. అందుకు 1914లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ( Spanish flu )ను ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. అప్పట్లో వైద్య రంగం ఇప్పుడు ఉన్నంతగా అభివృద్ధి చెందలేదు.. వ్యాక్సిన్లు కూడా లేవు.. కాబట్టి స్పానిష్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిందని చెప్పారు. ఆ తర్వాత ఈ వైరస్లు అనేక మార్పులు వచ్చాయని.. 1918 నాటికి ఇది సాధారణ ఫ్లూ వైరస్‌గా మారిపోయిందన్నారు. స్పానిష్ ఫ్లూ ( Spanish flu ) వైరస్ ఇప్పటికీ రూపాంతరం చెందుతూనే ఉందని చెప్పారు. ఈ కోణంలో చూస్తే ఒమిక్రాన్ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరమని.. సహజసిద్ధమైన వ్యాక్సిన్ అని డాక్టర్ నాగేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయో లేదో చెప్పలేమని డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. కాకపోతే సాధారణంగా వైరస్‌లో మార్పులు వచ్చి మ్యుటేషన్లు ఏర్పడినప్పుడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. అంతెందుకు స్పానిష్ ఫ్లూలో వచ్చిన మార్పుల ఆధారంగా ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కొత్త వ్యాక్సిన్లు విడుదల చేస్తుంటారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron | ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ఒమిక్రాన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి కేసులు..!
కరోనా నుంచి కోలుకున్న వారికి ‘ఒమిక్రాన్’ ముప్పు ఎంత..? నిపుణులు ఏమంటున్నరు..?
omicron fears | ఒమిక్రాన్ భయంతో భార్యాపిల్లలను చంపేసిన డాక్టర్
ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమా? దీన్ని ఎలా ఎదుర్కోవాలి?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

