ఒమిక్రాన్‌తో భారత్‌లో థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి కేసులు..!
Third Wave in India | Omicron | third wave | India | February | Manindra Agarwal | IIT scientis

న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమవుతుందని, ఫిబ్రవరి నాటికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో వచ్చిన కేసుల కంటే ఎక్కువగా.. నిత్యం లక్ష నుంచి 1.5లక్షల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. కొత్త వేరియంట్‌పై ప్రస్తుత అంచనా మేరకు దేశం ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ చూడగలదని, ఇప్పటివరకు ఒమిక్రాన్ తీవ్రత డెల్టా వేరియంట్లో చూసిన విధంగా లేదని గుర్తించినట్లు పీటీఐతో తెలిపారు.
అయితే, దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనానికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య పెరగలేదని పేర్కొన్నారు. కొత్త వేరియంట్లో వేగంగా వ్యాప్తి చెందే గుణం కనిపిస్తున్నప్పటికీ.. దాని తీవ్రత డెల్టా వేరియంట్లో కనిపించిన విధంగా లేదన్నారు. డెల్టా వ్యాప్తి సమయంలో తేలికపాటి లాక్డౌన్ (రాత్రి కర్ఫ్యూ, రద్దీపై ఆంక్షలు) విధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. డెల్టా కంటే మరింత తీవ్రమైన కొత్త వేరియంట్ వస్తే దేశంలో థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి ప్రారంభం కావొచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతకు ముందు తెలిపింది.
అయితే, నవంబర్ 26న దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఒమిక్రాన్’గా నామకరణం చేయడంతో పాటు వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా పేర్కొంది. వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్నప్పటికీ తీవ్ర ప్రభావం చూపిస్తుందా ? లేదా ? ఇంకా స్పష్టత రాలేదు. అయితే, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటుందని నిపుణులు పేర్కొన్నారు. మరో రెండు వారాల వేరియంట్‌కు సంబంధించిన మరింత సమాచారం అందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

