omicron fears | ఒమిక్రాన్ భయంతో భార్యాపిల్లలను చంపేసిన డాక్టర్

UP Doctor kills wife and children over omicron fears | గత రెండేళ్లుగా కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇవన్నీ కళ్లారా చూసిన ఓ డాక్టర్ మానసికంగా ఎంతగానో కుంగిపోయాడు. పైగా ఇదే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి మొదలు కావడంతో ఈ వేరియంట్ ఎవర్నీ వదలదని.. అందర్నీ చంపేస్తుందని ఆవేదన చెందాడు. ఆ భయంతో మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఒమిక్రాన్ నుంచి ఎలాగైనా తన కుటుంబానికి విముక్తి కల్పించాలని భావించి భార్యాపిల్లలను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
కాన్పూర్‌కు చెందిన డాక్టర్ సుశీల్ సింగ్ (55).. భార్య చంద్రప్రభ (50), కుమారుడు శిఖర్ సింగ్ (21) కుమార్తె ఖుషీ సింగ్ (16) కళ్యాణ్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాన్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫొరెన్సిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రితో రోజూ కరోనా కేసులు చూసి చూసి కొంతకాలంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో మరింత భయపడిపోయాడు. ఒమిక్రాన్ వేరియంట్ అందర్నీ చంపేస్తుందని ఫిక్సయ్యాడు. తన నిర్లక్ష్యం కారణంగా ఏదో ఓ రోజు తాను దాని బారినపడక తప్పదని.. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని భావించాడు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మరింత కుంగిపోయిన సుశీల్.. భార్యాపిల్లలు ముగ్గుర్నీ దారుణంగా చంపేశాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పమని తన సోదరుడు సునీల్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.
దీంతో భయపడిపోయిన సునీల్ సింగ్.. సుశీల్ ఫ్లాట్‌కి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో వదిన, పిల్లలు కనిపించారు. సునీల్ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో రక్తపు మరకలు అంటిన ఒక సుత్తెను గుర్తించారు. అలాగే ఒక డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒమిక్రాన్ అందర్నీ చంపేస్తుంది.. అందుకే దానికంటే ముందు నా భార్యాపిల్లలకు విముక్తి కల్పిస్తున్నా అని రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా డిప్రెషన్లో వదిన చంద్రప్రభను చంపేందుకు సుశీల్ ప్రయత్నించాడని సునీల్ సింగ్ పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుశీల్ సింగ్ కోసం మూడు బృందాలు వెతుకుతున్నాయని పోలీస్ కమిషనర్ ఆసిమ్ అరుణ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ దేశంలో తొలి కరోనా కేసు.. ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు
Omicron variant FAQs | ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేయవా? థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందా
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పని చేయవనడానికి ఆధారాల్లేవ్ : కేంద్రం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

