ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పని చేయవనడానికి ఆధారాల్లేవ్ : కేంద్రం
Omicron FAQs | కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు పని చేయవనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర

న్యూఢిల్లీ : కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు పని చేయవనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అయితే, కొత్తగా గుర్తించిన వేరియంట్లు వ్యాక్సిన్ ప్రభావాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. కొత్త ఉత్పరివర్తనం రోగనిరోధక శక్తిని ఎంత వరకు ప్రభావితం చేస్తుందనే దానిపై ఆధారాలు కావాలని, దీనికి మరింత సమయం పడుతుందని పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా గుర్తించింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి తరచూ అడిగి ప్రశ్నల (FAQs) జాబితాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
వ్యాక్సినేషన్ ముఖ్యం
శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ నుంచి కాపాడేందుకు యాంటీబాడీలు రక్షణ కల్పిస్తాయి. ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వైరస్.. వేగంగా పలు దేశాలకు వ్యాపించింది. వైరస్ లక్షణాలను బట్టి చూస్తే మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేసుల పెరుగుదల, వైరస్ తీవ్రతపై ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నది. కొవిడ్ టీకాలు వేగంగా వేయడం ద్వారా డెల్టా తీవ్రత తక్కువ ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టులతో ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? లేదా? తెలుసుకోవచ్చా అనే ప్రశ్నకు.. సాధారణంగా వినియోగిస్తున్న ఆర్టీ పీసీఆర్ పద్ధతిని వినియోగించి తెలుసుకోవచ్చని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

