కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
omicron variant | గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. హమ్మయ్యా ! కరోనా ప్రభావం తగ్గింది అని అనుకునేలోపే ఇది కొత్త రూపంలోకి మారి హడలెత్తిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ దేశాల్లో పుట్టకొచ్చిన కొత్త వేరియంట్ B.1.1.529 ప్రపంచ దేశాల్ని భయపెట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వేరియంట్‌కు డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్ అని పేరు పెట్టింది. ఇంతకీ ఈ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే పేరునే ఎందుకు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ( xi jinping )కు ఉన్న సంబంధమేంటి? ఒకసారి చూద్దాం..

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తోంది. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన ఉత్పరివర్తనం అని తెలియడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. వేగంగా విస్తరిస్తున్న B.1.1.529 వేరియంట్ పట్ల ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి తమ దేశాలకు ఆంక్షలను విధించాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో ) చాకచక్యంగా వ్యవహరించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పై విమర్శలు రాకుండా ఉండేందుకు తెలివిగా ఆలోచించింది.
కరోనావైరస్ బయటపడిన కొత్తలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొవిడ్-19 అని నామకరణం చేసింది. ఆ తర్వాత ఈ వైరస్ నుంచి పలు రకాల ఉత్పరివర్తనాలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటికి గ్రీకు అక్షరమాల ప్రకారం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా.. అంటూ డబ్ల్యూహెచ్‌వో పేర్లు పెట్టుకొచ్చింది. ఇందులో డెల్టా అత్యంత వినాశనం సృష్టించింది. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ముందు నుంచి అనుసరిస్తున్న గ్రీకు అక్షరమాల ప్రకారం డెల్టా తర్వాత వేరియంట్‌కు న్యూ ( Nu) అని పెట్టాలి. ఒకవేళ న్యూ తర్వత కొత్త వేరియంట్ గనుక వస్తే అప్పుడు దానికి జి ( Xi ) అని పెట్టాల్సి ఉంటుంది.
జి ( Xi ) అంటే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ( xi jinping ) పేరును ఇది ప్రతిబింబించేలా ఉంది. మొదట్నుంచి కరోనా వైరస్ చైనాలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పుట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు చైనాపై ఒకింత ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో B.1.1.529 తర్వాత వచ్చే వేరియంట్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేరుకు దగ్గరగా ఉన్న పేరు పెడితే ఇబ్బందులు వస్తాయని డబ్ల్యూహెచ్‌వో భావించింది. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎందుకని న్యూ, షి రెండు అక్షరాలను వదిలేసి ఆ తర్వాత వచ్చే అక్షరం ఒమిక్రాన్ పేరును కొత్త వేరియంట్‌కు పెట్టింది. ఈ మేరకు హార్వర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ మార్టిన్ కుల్డార్ఫ్ సరికొత్త వివరణ ఇచ్చారు.
News of new Nu variant, but WHO is jumping the alphabet to call it Omicron, so they can avoid Xi. pic.twitter.com/UJ4xMwg52i
— Martin Kulldorff (@MartinKulldorff) November 26, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?
omicron : ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రధాని మోదీ సమీక్ష.. విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా
Omicron | కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
omicron | ఆ దేశాలకు విమానాలను నిలిపేయండి.. ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అభ్యర్థన
దడపుట్టిస్తున్న B.1.1.529 variant .. హెవీ మ్యుటేషన్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
ఒమిక్రాన్ ఆందోళన.. ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సు వాయిదా
Omicron affect: సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ వన్ డే సిరీస్ వాయిదా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

