హైదరాబాద్: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి తమ దేశాలకు ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. దాంతో ఈ ప్రభావం ఆటలపై కూడా పడింది. ఒమిక్రాన్ కారణంగా దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య జరుగాల్సిన బెట్వే వన్ డే సిరీస్ వాయిదాపడింది.
కొత్త కరోనా వేరియంట్ భయాల నేపథ్యంలో సిరీస్ను వాయిదా వేసుకోవాలని రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఒక అంగీకారానికి వచ్చాయి. కాగా, ఒమిక్రాన్ విస్తృతి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు సౌతాఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పర అంగీకారంతో వన్ డే సిరీస్ను వాయిదా వేశాయి.