న్యూఢిల్లీ: ఆత్మకథ పుస్తకాలను యువత చదవాలని, ఇతరుల కష్టాల నుంచి వారు నేర్చుకోవాలని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవలం షార్ట్కట్లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ ‘ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్బు, మై స్ట్రగుల్స్’ అనే బుక్‌ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కోవింద్ జీవితం పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కోవింద్ పట్టుదలతో చదివి, రాజ్యాంగ హోదాలో అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా కోవింద్ ప్రజా జీవితంలో చురుకుగా ఉంటున్నారని, ఆఫీసు నుంచి తప్పుకున్న తర్వాత ఆయనేమీ రెస్టు తీసుకోలేదని, వన్ నేషన్.. వన్ ఎలక్షన్ స్కీమ్‌పై ఆయన వర్క్ చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
భారత ప్రజాస్వామ్యంలో ఆయన చేస్తున్న కృషి కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నదని ప్రధాని తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కోవింద్ నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఆత్మకథలను చదువుకోవాలని ప్రధాని మోదీ యువతను కోరారు. ఆ కథల్లో ఆనాటి వాస్తవిక పరిస్థితులు ఉంటాయని, ఇది జీవితానికి అనుభవంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం రీల్స్ యుగం నడుస్తోందని, సోషల్ మీడియా ప్రచారకర్తలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారని, షార్ట్‌కట్‌తో వెళ్తే జీవితం షార్ట్ అవుతుందని ఆయన అన్నారు. కోవింద్ ఆటోబయోగ్రఫీ భారత ప్రజాస్వామ్యానికి వారసత్వంగా మారుతుందని, కొత్త తరం యువత ఆ ఆత్మకథ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అన్నారు.
కోవింద్ లాంటి యువత రాబోయే తరాలకు అవసరం అని, పరిస్థితులను చూసి భయపడడం కాదు, పట్టుదలతో సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు మార్గం వేయాలని, కోవింద్ ఆటోబయోగ్రఫీ యువతకు ప్రేరణ ఇస్తుందని మోదీ అన్నారు. వ్యక్తిగత జీవితంలో కోవింద్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ ఆయన సాధించిన విజయం భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుందన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, “… Based on my understanding of his life and my knowledge of his capabilities, I can say with full confidence that Ramnath Kovind ji’s autobiography will become a cherished legacy for Indian democracy and society. There is so… pic.twitter.com/CKs0BmpyJe
— ANI (@ANI) August 12, 2026