ఈ 26న గాంధీనగర్ గురుకులంలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల గాంధీనగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.హరికృష్ణ గురువారం...
కారేపల్లి, సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల గాంధీనగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 26న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.హరికృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లతో పాటు, జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అందుబాటులో ఉన్న సీట్లను కూడా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 5 నుండి 9వ తరగతి వరకు ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష (CET)కు హాజరై ఉండాలని సూచించారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కౌన్సెలింగ్‌కు హాజరై, అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లను బట్టి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ప్రవేశానికి అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. 5వ తరగతిలో 5 సీట్లు, 7వ తరగతిలో 4 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు, 9వ తరగతిలో 3 సీట్లు, ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీలో ఖాళీల ఆధారంగా భక్తి చేయనున్నట్లు వివరించారు. స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 26న గాంధీ నగర్ పాఠశాల/కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

