వయసుతో సంబంధం లేకుండా చక్కెర వ్యాధి అందరిపై దాడిచేస్తున్నది. చాప కింది నీరుల పారి.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ వ్యాధి బాధితులుగా మారుస్తున్నది. డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులే అని వైద్యులు చెప్తున్నారు. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో 60 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. ఇంతటి నిశ్శబ్ధ హంతకిని మన వంటింట్లో దొరికే వస్తువులతో అదుపులో పెట్టుకోవచ్చుననే విషయాన్ని గుర్తించాలి.
జన్యుపరమైన కారణాలవల్ల మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. అలాగే, పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. కారణాలేవైనా.. శరీరం బరువును అదుపులో ఉంచుకోవడం, పొగాకు, మద్యం వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టడం వంటి చర్యల వల్ల డయాబెటిస్ రాకుండా నిరోధించుకోవచ్చు. ఊబకాయం, నియంత్రణ లేని జీవనవిధానం రిస్క్‌ను మరింత పెంచుతాయి. నిత్యం వ్యాయామం చేయడం, బరువును చెక్‌చేసుకోవడం వల్ల నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మనం తీసుకునే ఆహారంలో పోషకాలతో కూడిన ఫుడ్మెనూను నిత్యం ఫాలో అవ్వాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కరెక్ట్‌గా ఉంటాయి. ధూమపానం వెంటనే మానుకోవాలి. మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా చక్కెరను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
పిల్లల్లోనే కాకుండా పెద్దల్లో కూడా శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ మొత్తంలో క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్ బారిన పడేందుకు దారితీస్తుంది. అందుకని చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను దూరం పెట్టాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటివి తీసుకోవాలి.
సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలను కూడా మెనూలో చేర్చుకోవాలి. ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు నిత్యం రెండున్నర గంటల పాటు వేగంగా నడవటం, మెట్లు ఎక్కడం వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి.
నిత్యం నిర్ణీత సమయానికి ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. భోజనంలో పోషకాలు అందించే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గోర్లు కట్ చేసేప్పుడు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తినాలి.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..