e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

Gattipally Shivalal
Gattipally Shivalal

Gattipally Shivalal | చూసే వారికే లోపం.. అనుకునేవారికి అయ్యో పాపం! కానీ, తనలోని లోపాన్ని ఏనాడూ శాపంగా భావించలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించాడు శివలాల్‌. మరుగుజ్జుతనం శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపించాడు. పెద్దపల్లి జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్‌ వయసు 39 ఏండ్లు. జన్యులోపంతో ఎదుగుదల ఆగిపోయింది. అయితేనేం, మానసికంగా మాత్రం ఎంతో ఎదిగాడు. దేశంలోనే శాశ్వత కార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి మరుగుజ్జుగా రికార్డు నెలకొల్పాడు. ఆ ప్రయాణం శివలాల్‌ మాటల్లోనే..

Gattipally Shivalal
Gattipally Shivalal

చిన్నప్పటి నుంచీ పట్టుదల ఎక్కువ. నన్ను చూసి నలుగురూ నాలుగు మాటలు అనేవారు. అవేవీ నేను పట్టించుకునేవాణ్ని కాదు. బాగా చదువుకోవాలని అనుకున్నా. డిగ్రీ వరకు కష్టపడి చదివా. బీకాం పూర్తి చేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ పాసైన తొలి మరుగుజ్జు నేనే. తర్వాత హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ సంస్థలో అడ్మిన్‌ మేనేజర్‌గా చేరాను. ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉంటున్నా. మా ఊరికే చెందిన చిన్మయి కూడా మరుగుజ్జే. నాలాంటి వాళ్లనే పెండ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆమెను నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నా. మాకు ఒక బాబు.

Gattipally Shivalal family

బెంగళూరులో నేర్చుకున్నా..

- Advertisement -

ఎప్పుడు అవకాశం వచ్చినా నా ప్రత్యేకతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తా. డ్రైవింగ్‌ నేర్చుకున్నదీ అందుకే. ఆలోచన రాగానే నగరంలోని డ్రైవింగ్‌ స్కూళ్లను సంప్రదించా. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇంటర్నెట్‌లో వెతికితే బెంగళూరులో ఒకతను నేర్పిస్తారని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి 15 రోజుల్లో డ్రైవింగ్‌ నేర్చుకున్నా. ఆయన ద్వారా హైదరాబాద్‌లో ఇస్మాయిల్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. డ్రైవింగ్‌లో మరింత పట్టు సాధించిన తర్వాత రూ.6 లక్షలు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొన్నా. నాకు అనుగుణంగా బండికి మార్పులు చేర్పులు చేయించాను. ఆరు నెలలు కష్టపడి డ్రైవింగ్‌ మీద పట్టు సాధించాను.

Gattipally Shivalal driving licence

లైసెన్స్‌ ఇవ్వనన్నారు

డ్రైవింగ్‌ అయితే నేర్చుకున్నా కానీ, మూడు అడుగుల ఎత్తే ఉన్నాననీ, రూల్స్‌ ప్రకారం లైసెన్స్‌ ఇవ్వడం కుదరదనీ ఆర్టీవో చెప్పారు. అప్పుడు ఒక అమ్మాయి రెండు చేతులూ లేకుండా కారు నడిపి, తనకు లైసెన్స్‌ ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది. వెంటనే ఆమెకు లైసెన్సు మంజూరు చేయమంటూ న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చింది. ఆ విషయం ఆర్టీవోకు చెబితే.. సరేనని లెర్నింగ్‌ ఇచ్చారు. మూడు నెలలకు డ్రైవింగ్‌ టెస్ట్‌ పెట్టి లైసెన్సు జారీ చేశారు. దేశంలో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించిన తొలి మరుగుజ్జు నేనే అని లిమ్కాబుక్‌ వాళ్లు చెప్పేవరకు నాకూ తెలియదు. నాకు లైసెన్స్‌ వచ్చి 10 నెలలు అవుతున్నది. 2020 డిసెంబర్‌ నుంచి నేనూ అందరిలానే నా కారులో ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నా. గిన్నిస్‌ రికార్డ్‌ కూడా సాధించాను. ఈ విజయాలన్నిటికీ కారణం నా పట్టుదలే. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ వెక్కిరింతలే నాలో తపనను పెంచాయి. నాలా బాధపడుతున్న వాళ్లకు డ్రైవింగ్‌ నేర్పించాలని అనుకుంటున్నా. ముందుగా నా భార్యకు కారు నడపడం నేర్పిస్తా. దివ్యాంగులు, మరుగుజ్జుల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ పెట్టాలని నా ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం ఆశిస్తున్నా.

…? గుళ్లపెల్లి సిద్ధార్థ గౌడ్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావ‌ర్క‌ర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్య‌మైంది?

rema rajeshwari | ఫోర్బ్స్‌ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్‌

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement