Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?

Matilda Kullu featured in forbes | ఆమె సెలబ్రిటీ కాదు. విశ్వ సంపన్నురాలు అంతకంటే కాదు. కార్పొరేట్ ప్రపంచంతో ఆమెకు సంబంధమే లేదు. సైకిల్‌పై ఊరంతా తిరుగుతూ వ్యాక్సిన్లు వేయించడం, పౌష్టికాహారం అందించడం, గ్రామాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడం.. ఇదే ఆమె పని, ఆమెకు తెలిసిన ప్రపంచం. ఈ అంకిత భావానికి మెచ్చే.. ‘ఫోర్బ్స్’ పత్రిక మతిల్దా కుల్లూను స్వశక్తిమంతులైన మహిళల జాబితాలో చేర్చింది.

ఒడిశాకు చెందిన మతిల్దా కుల్లూ ఓ ఆశా వర్కర్. పదిహేనేండ్లుగా పనిచేస్తున్నది. సుందర్‌గఢ్ జిల్లాలోని గర్‌గండ్‌బహల్ ఆమె స్వగ్రామం. ఉదయం ఐదు గంటలకే తను దినచర్య ప్రారం భిస్తుంది. గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి రోగులకు మందులు ఇస్తుంది. గర్భిణులకు సాయపడుతుంది. పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పిస్తుంది. పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. సర్కారు తరఫున వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తుంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్‌గా ఎన్నో ప్రాణాలను కాపాడిన మతిల్దా కరోనా బారినపడింది. కోలుకోగానే మళ్లీ పనిలో నిమగ్నమైపోయింది. ఆ అంకితభావం గురించి ‘ఫోర్బ్స్’కూ తెలిసింది. మతిల్దాకు స్వశక్తిమంతులైన మహిళల జాబితాలో చోటు దక్కడం పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆనందం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
rema rajeshwari | ఫోర్బ్స్ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
నా పాట కోసం మా నాన్న ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు
కొడుకు కోసం వెంటాడి మరి చిరుతతోనే పోరాడింది
ఇంట్లో చెప్పకుండానే నటించా.. సినిమా విడుదలయ్యాక నాన్నకు తెలిసి..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

