సీట్ల పెంపును నిర్ణయించేది కమిషనే
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సోమవారం డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే డీలిమిటేషన్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను ఎంత పెంచాలన్నది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. మహిళలకు రిజర్వు చేయాల్సిన 33 శాతం సీట్లను కూడా కమిషనే గుర్తించనుంది. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత ఏర్పాటులో డీలిమిటేషన్ కమిషన్‌కు ముగ్గురు ప్రధాన సభ్యులు ఉంటారు.
- డీలిమిటేషన్ కోసం ముగ్గురు ప్రధాన సభ్యులతో ఏర్పాటు
- ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సహ సభ్యులకు చోటు
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సోమవారం డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే డీలిమిటేషన్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను ఎంత పెంచాలన్నది డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించనుంది. మహిళలకు రిజర్వు చేయాల్సిన 33 శాతం సీట్లను కూడా కమిషనే గుర్తించనుంది. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత ఏర్పాటులో డీలిమిటేషన్ కమిషన్‌కు ముగ్గురు ప్రధాన సభ్యులు ఉంటారు. విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కమిషన్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసే ఎన్నికల కమిషనర్‌తోపాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు.
మేఘాలయ, నాగాలాండ్‌లలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు బదులుగా గవర్నర్ నామినేట్ చేసే వ్యక్తి కమిషన్ సభ్యుడిగా ఉంటారు. కమిషన్ పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. ముగ్గురు ప్రధాన సభ్యులతోపాటు ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సహ సభ్యులను నామినేట్ చేస్తారు. వీరిలో ఐదుగురు లోక్‌సభ ఎంపీలను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేస్తారు. మిగతా ఐదుగురు రాష్ట్ర ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేస్తారు. ఈ సభ్యులు కమిషన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కమిషన్ నిర్ణయాలపై ఓటు వేసే, సంతకం చేసే హక్కు వారికి ఉండదు. డీలిమిటేషన్ కోసం రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ సాయం తీసుకోవచ్చు.
బిల్లుపై రాష్ట్రపతి సిఫారసు
డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026ను పరిశీలించాలని లోక్‌సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఫారసు చేశారు. కేంద్ర కేబినెట్ శుక్రవారం రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను, డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026ను ఆమోదించింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, ఈ బిల్లులు ఆమోదం పొందితే, అన్ని రాష్ర్టాల్లోనూ లోక్‌సభ నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

