e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News నా పాట కోసం మా నాన్న‌ ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు

నా పాట కోసం మా నాన్న‌ ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు

folk singer sowmya | నాన్నకు జానపదమంటే ఖాయిష్‌. అదే ఆసక్తి బిడ్డలో చూశాడు. కూతురికి పాట నేర్పితే ఇద్దరి కలా నెరవేరుతుందని అనుకున్నాడు. ఆ ఆశ ఫలించింది కానీ, ఆటంకాలు ఎదురైనయి. బిడ్డ పాటకోసం ఇంట్లో టీవీ అమ్మేసిండు. వచ్చిన పైసలతో ప్రోగ్రామ్‌కి పంపిండు. నాన్న కోసం గోదావరిఖని నుంచి గోలుకొండ దాకా గొంతెత్తి ఆలపిస్తున్న పాతపల్లి సౌమ్య పాట ముచ్చట..

folk singer sowmya
folk singer sowmya

నాన్నకు జానపదాలంటే ఇష్టం. పాడాలని ఉన్నా ఆయనకు అవకాశం రాలేదు. మేం ముగ్గురం. ఇద్దరన్నలకూ ఈ కళ అబ్బలేదు. చిన్నదాన్ని కాబట్టి నాతో ఎక్కువ సమయం గడిపేటోళ్లు అమ్మానాన్న. తోచిన పాటలు పాడేటోళ్లు. నేనూ గొంతు కలిపేదాన్ని. మొదట్లో అమ్మానాన్న పట్టించుకోలేదు. తర్వాత నా ఆసక్తిని గమనించిండ్రు.

నాన్న కల

- Advertisement -

మా ఊరు గోదావరిఖని. దేశభక్తి గీతాలతో నా పాటల ప్రస్థానం మొదలైంది. నా పాటలంటే నాన్నకు మస్తు ఇష్టం. ‘మంచిగ పాడాలె. మంచి పేరు తెచ్చుకోవాలె’ అంటుండె. ‘నా బిడ్డె పాటలు బాగ పాడుతది. ఏదైనా అవకాశం ఉంటె చూడుండ్రి’ అని మా శ్రేయోభిలాషి రాజన్నతో చెప్పిండు. ఆయన నన్ను ప్రోగ్రామ్స్‌కు తీసుకెళ్తుండె. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం షురువైంది. రోజుకో కార్యక్రమం చేసుకుంటూ ఊరూరూ తిరిగేదాన్ని. ‘ఈ అమ్మాయి వయసెంత? పాడుతున్న పాటలు సూడుండ్రి’ అని అందరూ ఆశ్చర్యపోయేటోళ్లు.

ఎన్నో అవమానాలు

మాది, మధుప్రియది, పద్మావతిది ఒకే వాడకట్టు. ఒకేసారి పాటల ప్రస్థానం మొదలువెట్టినం. ఒకేసారి తెలంగాణ ఉద్యమంలో కలిసి పాడినం. ఎక్కడ ప్రోగ్రామ్‌ ఉన్నా నాన్న నాకు తోడుగా వస్తుండె. ‘నా బిడ్డ గొంతు పదిమందికి వినిపించాలి’ అనే ఆరాటం ఉంటుండె. మా చుట్టాలు మాత్రం ‘నీ పాటలేంది? నీ కథేంది?’ అని అవమానించిండ్రు. నాకంటూ ఓ గుర్తింపు వచ్చి
నంక, నేనే ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నా. ఓసారి, ఒక పెద్ద అవకాశం వచ్చింది. పైసలు వచ్చినా, రాకపోయినా అసొంటి ప్రోగ్రామ్స్‌ చేయాలన్నది నా కల. తెల్లారితే ఈవెంట్‌. చేతిలో పది రూపాయలు కూడా లేవు. నాకు భయం పట్టుకుంది. నాన్న మున్సిపల్‌ శాఖలో పని చేస్తడు. అయితే, రోజూ నా వెంట ప్రోగ్రామ్స్‌కు వస్తూ ఉద్యోగానికి వెళ్లకపోవడంతో జీతం రాలేదు. చూస్తే ఇంట్లో టీవీ ఒక్కటే కనిపించింది. బిడ్డ ప్రోగ్రామ్‌ కంటే టీవీ ఎక్కువ కాదని అనుకున్నడో ఏమో, సెకండ్‌ హ్యాండ్‌ కింద అమ్మేసిండు. నాలుగువేలు వస్తే, ఆ పైసల్తో ప్రోగ్రామ్‌ చేసినం. మంచి సక్సెస్‌ అయ్యింది. వారం రోజులకే మల్లొక కొత్త టీవీ కొనుక్కొచ్చిండు.

టాలెంట్‌ చూపిస్తా

మా ఆయన సాంస్కృతిక సారథిలో డ్యాన్సర్‌, వాద్యకారుడు. మా మామయ్య రతన్‌ సింగ్‌ డప్పు కళాకారుడిగా ఉద్యమంలో పనిచేసిండు. మాది ప్రేమ పెండ్లి. అమ్మానాన్నకు చెప్తే అంగీకరించలేదు. ఇక మేమే పెండ్లి చేసుకున్నం. నా కెరీర్‌ అమ్మానాన్న భిక్ష. నాన్న నా కోసం ఉద్యోగాన్నిపణంగా పెట్టిండు. ఇప్పుడు అంతా కలిసిపోయినం. యూ ట్యూబ్‌లో అనేక జానపదాలు పాడిన. ‘చిన్నదానా వయ్యారంగా ఒంపూసొంపులున్నదానా’, ‘నా చెవులకు పెట్టాలి సక్కని జత బుట్టాలు’, ‘గోలుకొండా గొల్లకొండా పిల్లా.. బోనమెత్తిన బోనం కొండా’, ‘దేవదరి తుమ్మెదాలో ఓ పిల్లా.. దేవదరీ తుమ్మెదాలో’, ‘నా తోడుగా నువ్వు వస్తువనీ రాములా’, ‘చాయియ్యవోయ్‌ పిలగా చాయియ్యావోయ్‌’, ‘గిరుకు గిరుకుమనిందో ఎర్రపోరీ గజ్జెల గిరుకు’.. పాటలు పేరు తీసుకొచ్చినయి. నా దగ్గర మంచి పాటలున్నయి. వాటిని మంచిగా ప్రజెంట్‌ చేసి సినిమా
అవకాశాలు పొందాలనే లక్ష్యంతో ‘సౌమ్య రాగం’ అనే చానెల్‌ పెట్టిన. మీ అందరి ప్రోత్సాహంతో ఆ కలనూ నెరవేర్చుకుంటా.

చెట్టమ్మ పాట

నా పాటలకు కాలేజీల్లో మంచి ఆదరణ లభించేది. ఆ స్పందనే నాలో పాడాలనే ఆసక్తిని రెట్టింపు చేసింది. రసమయి గారు సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించిండ్రు. ఒకవైపు జానపదాలు, మరోవైపు సంక్షేమ పథకాల పాటలు పాడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో వరమై వచ్చింది.. ‘తెలంగాణకు హరితహారం’. ‘చెట్టూ చెట్టమ్మను నేను చెట్టును నేనురా.. మనిషి మనుగడకు ప్రాణంపోసే అమ్మను నేనురా.. నీ అమ్మను నేనురా’ అంటూ సాగే నా పాట మారుమోగింది. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ లాంటి పాట ఇది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకుని ఏం చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఇదే నా జ‌వాబు

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

ఇంట్లో చెప్ప‌కుండానే న‌టించా.. సినిమా విడుద‌ల‌య్యాక నాన్న‌కు తెలిసి..

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement