e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె


singer sushmitha | మైకులు మనుగడలో ఉన్నప్పుడు, ఆ ఊర్లో ఎక్కడ మైకు పెట్టినా ఒకే గొంతు వినబడేది. ‘హలో హలో మైక్‌ టెస్టింగ్‌’ అన్న మాటకు బదులు పాట మొదలయ్యేది. ఆ పాటే తర్వాత ఉద్యమ వేదికలెక్కింది. ఇప్పుడు, జానపద జాతరలో జోరుమీదున్నది. డిజిటల్‌ హంగులద్దుకొని డీజే వెర్షన్‌లలో జానపదాన్ని దుమ్ములేపిస్తున్న పట్నం సుస్మిత పాట ముచ్చట..

singer sushmitha
singer sushmitha

మాది సంగారెడ్డి జిల్లా నల్లవెల్లి. నన్ను అందరూ ‘నాయినమ్మ సాలువడ్డది’ అంటుంటరు. ఆమె మస్తు పాడుతుండె. తన పేరు నర్సమ్మ. బతుకమ్మ పాటలు చానా ఉండేవి తన దగ్గర. అమ్మ పోచమ్మ కూడా నాయినమ్మతో కలిసి పాడేది. నాయిన పేరు పోచయ్య. మాకు వ్యవసాయం ఉంది. ఐదారు తరగతి వరకు ఇల్లు, పొలం.. ఇదే నా ప్రపంచం. మాకు మైక్‌ సెట్‌ ఉండేది. అప్పట్లో అది స్టేటస్‌ సింబల్‌. పక్కూరి వాళ్లు కూడా ‘పుంగీలు’ కావాలని వస్తుండె. నాయిన ఎప్పుడూ బిజీగా ఉండేటోడు. పెండ్లిళ్లు, పండుగలకు మా మైకులు మోగుతుండె. మైక్‌ పట్టుకొని ‘హలో హలో’ అనాలని చాలా ఖాయిష్‌ ఉంటుండె. కానీ, ఏడాదిలో ఏ ఒక్కనాడూ మైక్‌ మా ఇంట్లకు రాకపోతుండె. ఒకటి అయిపోయినంక మరో ఆర్డర్‌. నాయిన అట్నుంచి అటే తీసుకెళ్తుండె. నేనూ వెళ్తుండేదాన్ని. టెస్టింగ్‌ చేసేటప్పుడు నాయిన ‘హలో హలో మైక్‌ టెస్టింగ్‌’ అంటుండె. నా ఆసక్తిని గమనించి కొంతమంది ‘పాట పాడి మైక్‌ టెస్ట్‌ చెయ్‌రా’ అని ప్రోత్సహించడంతో, ఎక్కడ మైక్‌ పెట్టినా నాయన నాతోనే పాడిస్తుండె.

singer sushmitha
singer sushmitha

కలేమో అనిపించేది

- Advertisement -

సంతోషంగా సాగిపోతున్న మా జీవితాల్లో ఓ పెద్ద విషాదం.. నాయిన చనిపోవడం. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడినం. ఇద్దరం చిన్న పిల్లలమే. అమ్మ ధైర్యంజేసి బాధ్యత తీసుకున్నది. ఆడమనిషి అయినా వ్యవసాయం చేసింది. నాయిన బతికున్నప్పుడే సౌండ్‌ బాక్స్‌ల హవా వచ్చేసి, మైక్‌సెట్‌ల వాడకం తగ్గిపోయింది. చేసేదేమీ లేక వాటిని అగ్గువ సగ్గువకు అమ్మేసినం. చదువుపై దృష్టి పెట్టిన. నేను సింగర్‌ కావాలన్నది నాయిన కోరిక. పాట వినిపిస్తే పానమంతా ఎటో అయ్యేది నాకు. మా టీచర్లు నాలో టాలెంట్‌ని గుర్తించిండ్రు. జిల్లాలో ఎక్కడ ఈవెంట్‌ జరిగినా తీసుకెళ్లేవాళ్లు. అట్లా ఏర్పుల వినేశ్‌కు నన్ను పరిచయం చేసిండ్రు. వినేశ్‌తో కలిసి బయట ప్రోగ్రామ్స్‌ చేయడం మొదలువెట్టిన. నిజంగా, పాటంటే ఏంది? ఎట్లా పాడితే జనానికి నచ్చుతుంది? అన్నది అక్కడే నేర్చుకున్నా. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఎన్నో వేదికలెక్కి జై తెలంగాణ పాటలు పాడిన. ఫలానా పాట ఫలానా సింగర్‌ పాడితేనే బాగుంటుందనే పేరు సంపాదించిన. ప్రస్తుతం ‘జనచైతన్య కళా సంస్థ’లో పనిచేస్తున్న. ఎర్రవెల్లి రవి మా గ్రూప్‌లో తబలిస్ట్‌. మా మెంటర్‌. నాకు గైడ్‌ లాంటోడు.

singer sushmitha
singer sushmitha

విమర్శలను పట్టించుకోను

కల్చరల్‌ ఈవెంట్స్‌లో మాత్రమే పాడుతున్న నన్ను డిజిటల్‌ మీడియా ఆకర్షించింది. యూట్యూబ్‌లో మంచిమంచి పాటలు పాడాలని నిర్ణయించుకున్న. ఇప్పటివరకు ఇరవై అయిదు జానపదాలు యూట్యూబ్‌ కోసం పాడిన. ‘పాలోయమ్మ పాలో’ పాట పేరు తీసుకొచ్చింది. నేను పాటను కెరీర్‌గా ఎంచుకున్న రోజుల్లో సంపాదన అంతగా ఉండేది కాదు. ఈ డిజిటల్‌ యుగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నయి. వాస్తవానికి నాయిన కల నెరవేర్చాలని పాటలవైపు మళ్లిన కానీ, డబ్బుల కోసం కాదు. నాయిన మా నుంచి దూరమైనప్పటి నుంచీ చాలా సమస్యలు ఎదుర్కొన్నం. అందులో నా కెరీర్‌కు సంబంధించినవి కూడా ఉన్నయి. నాకు పాట అంటే ఇష్టం కాబట్టి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తుంట. అదిచూసిన వాళ్లు ‘నీకెందుకు? మీ అమ్మ ఒక్కతే ఎంతకాలమని పొలం పనిచేస్తది. పాటలు పాడి నువ్వు చేసేదేముంటది’ అని నిరాశపరచినా పట్టించుకోను. పాటతోనే ప్రయాణం కొనసాగిస్తున్న.

నేనేంటో అమ్మకు తెలుసు

మైక్‌సెట్‌ నుంచి మైక్రోఫోన్‌ దాకా వచ్చిన. ఇక నాకు కావాల్సింది సినిమా పాటల అవకాశం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న. ఒక సినిమాలో పాటలో కొంతభాగం పాడే అవకాశం వచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ ‘విశాలాక్షి’ సినిమా కోసం పాడిన. నేను సింగర్‌ను కాకపోయి ఉంటే, ఇంత గుర్తింపు వచ్చేది కాదు. ఇంత హ్యాపీగా ఉండకపోదునేమో. నా ప్రతిభను గుర్తించిన ‘జ్ఞాన సరస్వతి చారిటబుల్‌ ట్రస్ట్‌’ వాళ్లు నేషనల్‌ అవార్డు ఇస్తున్నరు. డిసెంబర్‌ 4న అవార్డు అందుకోబోతున్న. ఈ టైమ్‌లో నాయిన ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంటది. కొన్నిసార్లు, కార్యక్రమాల్లో ఆలస్యం అయినా అమ్మ అర్థంచేసుకుంటున్నది. రోజూ బయల్దేరుతున్నప్పుడు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నది.


…? దాయి శ్రీశైలం

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement