Maoists : సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులు సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలువనున్నారు. దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం.
ఈ అంశానికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. అయితే లొంగిపోనున్న మావోయిస్టులలో మావోయిస్టు సుప్రీం గణపతి లేరని సమాచారం.