Heavy rains | జగిత్యాల(Jagtial )జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) నేపథ్యంలో గురువారం (జూలై 30) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవు( Holiday) ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాము తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు బదులుగా రానున్న రెండో శనివారాన్ని పని దినంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షం కురిసే సమయాల్లో చెట్లకింద ఉండొద్దని హెచ్చరించారు.