జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్‌కి(Medigadda Barrage) వరద ప్రవాహం( Floods) పోటెత్తుతుంది. గురువారం బ్యారేజ్ వద్ద 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా బ్యారేజ్‌లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదనీటిని భారీ నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(Heavy rains) కారణంగా బ్యారేజీకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.