custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..

sithaphal ice cream | సీతాఫలం.. సీతమ్మవారికి నచ్చిన ఫలం కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. శీతకాలంలో విరివిగా పండుతుంది కాబట్టి సీతాఫలమైందనీ అంటారు. పేరు వెనుక కారణం ఏదైనా.. పండు లోపలి కండ మాత్రం కలకండే! అందులోనూ పాలమూరు సీతాఫలాల గురించి చెప్పాలంటే మరో రామాయణమే అవుతుంది. కాబట్టే, స్కూప్ ఐస్ క్రీం కంపెనీవాళ్లు నవాబ్‌పేట మండల మహిళా సమాఖ్యతో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు. స్థానిక మహిళలు సరఫరా చేసే సీతాఫలాల గుజ్జుతో తీయతీయని, చల్లచల్లని ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నారు. దాన్ని ‘రియల్ సీతాఫల్’ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు. సెర్ప్ సంస్థ ఇటు మహిళా సంఘాలకు, అటు ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీకి వారధిగా నిలిచింది. జిల్లాలో అత్యధికంగా నవాబ్‌పేట మండలంలోనే సీతాఫలాలు లభిస్తాయి. దీంతో, ఇక్కడ రూ.5 లక్షలు ఖర్చుచేసి సీతాఫలాల ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మండలానికి చెందిన 12 వందల మంది మహిళలు సీతాఫలాల సేకరణలో పాలుపంచుకొంటున్నారు. దీనివల్ల.. మహిళలకు ఉపాధి, కస్టమర్లకు మధుర ఫలాలను తిన్న అనుభూతి!
…? పెద్ది విజయ భాస్కర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..
మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

