e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ఇంట్లో చెప్ప‌కుండానే న‌టించా.. సినిమా విడుద‌ల‌య్యాక నాన్న‌కు తెలిసి..

ఇంట్లో చెప్ప‌కుండానే న‌టించా.. సినిమా విడుద‌ల‌య్యాక నాన్న‌కు తెలిసి..

Tanuja Gowda | కాలం ఒక్కొక్కరిని ఒక్కోలా పరీక్షిస్తుంది. తనూజ పుట్టస్వామి కూడా పుట్టెడు సవాళ్లను ఎదుర్కొన్నది. తండ్రిని ఎదిరించి ఆమె ఎంచుకున్న నట జీవితం.. ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ‘ముద్దమందారం’ పార్వతిగా తెలుగు వారికి దగ్గర చేసింది. జీటీవీ ‘అగ్ని పరీక్ష’ సీరియల్‌ తన నటనకు ఓ పెద్ద పరీక్ష అంటూ ‘జిందగీ’తో తనూజ పంచుకున్న ముచ్చట్లు..

Tanuja Gowda
Tanuja Gowda

మాది కర్ణాటక. పుట్టింది పల్లెలో అయినా పెరిగిందంతా బెంగళూరులోనే. ఇంటర్‌ వరకూ చదువుతప్ప వేరే విషయాలపై ఆసక్తి ఉండేది కాదు. కాలేజ్‌ ఫంక్షన్లో ఓ చానల్‌ వాళ్లు నన్ను చూసి ఓ షో చేయమని అడిగారు. ఇష్టం లేకపోయినా స్నేహితుల బలవంతంతో ఒప్పుకొన్నా. కానీ, ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందోనని భయం. అందుకే చెప్పలేదు. ఆదివారం ప్రసారమయ్యే ఆ లైవ్‌ షోను ఫ్రెండ్స్‌, లెక్చరర్స్‌ సహాయంతో చేసేదాన్ని. ఇంట్లో ఎవరికీ టీవీ చూసే అలవాటు లేకపోవడంతో చాలా రోజుల వరకు ఏ సమస్యా రాలేదు. కానీ ఎవరో అమ్మకు చెప్పడంతో పెద్ద గొడవైంది. మొత్తానికి అమ్మను ఒప్పించాను. నాన్నకేమో సినిమా పరిశ్రమ అంటేనే పడదు. ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందోనని అమ్మ భయం. ఓ ఆరు నెలలు నాన్నకు తెలియకుండా మేనేజ్‌ చేశాను.

Tanuja Gowda
Tanuja Gowda

సినిమా అవకాశం..

- Advertisement -

యాంకరింగ్‌ చేస్తుండగానే, ఓ షార్ట్‌ ఫిలింలో అవకాశం వచ్చింది. పదిహేను రోజులు అవుట్‌డోర్‌ షూటింగ్‌. ఆరునూరైనా రాత్రి అయ్యేసరికి నాన్న కండ్ల ముందు ఉండాల్సిందే. మేం ముగ్గురం అమ్మాయిలం. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా, ఏ లోటూ రాకుండా పెంచారు. ఆయన మాట కాదనలేని పరిస్థితి. చివరికి అమ్మ సాయంతో తిరుపతి టూర్‌ అని చెప్పి సినిమా పూర్తి చేశాను. ‘చిత్రం కాదు నిజం’ పేరుతో తెలుగులోనూ వచ్చింది. సినిమా బయటికి రాగానే నేను నటిస్తున్న విషయం నాన్నకు తెలిసింది. పెద్ద గొడవ. వారం రోజులు ఇంట్లో ఎవరితోనూ మాట్లాడలేదు. నటించడం మానేయమని గట్టిగా చెప్పారు. కాదని చెప్పినా..నాన్న వద్దని చెప్పాక, చాలారోజులు ఏ ప్రాజెక్టూ ఒప్పుకోలేదు. ఆ సమయంలోనే అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌వారి జీ తెలుగు ‘ముద్దమందారం’ సీరియల్లో అవకాశం వచ్చింది. తెలియని భాష, కొత్త చోటు అని అమ్మ అడ్డు చెప్పడంతో నేనూ వద్దనుకున్నా. కానీ మంచి అవకాశాన్ని వదులుకుంటున్నానేమో అనిపించింది. అమ్మను బతిమాలితే, నాన్నతో మాట్లాడింది. ఆయన ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో నాన్నను ఎదిరించింది అమ్మ. ‘మీ పరువు, పంతం మీకు ముఖ్యమైతే. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. తనేంటో నాకు తెలుసు’ అంటూ నన్ను తీసుకుని హైదరాబాద్‌ వచ్చేసింది. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ నాకు తోడుగా ఉంది. ఆ అయిదు నెలలూ నాన్న నుంచి ఒక్క ఫోన్‌కాల్‌ కూడా రాలేదు.

Tanuja Gowda అగ్నిపరీక్ష
Tanuja Gowda

పార్వతిగా దగ్గరయ్యా..

‘ముద్దమందారం’ సీరియల్‌తో మంచి పేరు, గుర్తింపు లభించింది. పార్వతిగా తెలుగువారికి దగ్గరయ్యా. అనుకున్నది సాధించానని సంతోషించేలోపు నాన్నను బాధపెట్టానన్న సంగతి గుర్తుకొచ్చేది. ఒకసారి నాన్న స్నేహితుడు కలిసి ‘చాలా బాగా నటిస్తున్నావమ్మా. భాష రాకపోయినా చక్కగా చేస్తున్నావు’ అన్నారు. నేను తెలుగులో సీరియల్‌ చేస్తున్న విషయం ఎవరికీ చెప్పలేదు. అదే విషయం ఆయన్ని అడిగితే, ‘మీ నాన్న రోజూ వచ్చి మా ఇంట్లో నీ సీరియల్‌ చూస్తారు కదా!’ అని జవాబిచ్చారు. నమ్మలేకపోయా. నటించొద్దంటూ నాతో మాట్లాడటం మానేసిన నాన్న నా సీరియల్‌ చూస్తున్నారంటే ఆశ్చర్యమేసింది. ఆరోజు రాత్రి నాన్నతో మాట్లాడాను. క్షమాపణ చెప్పాను. ఇక నాన్న మనసుకు గాయం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకొన్నా. కెరీర్‌ వదిలేయడానికే సిద్ధపడ్డాను. అప్పుడే లాక్‌డౌన్‌ రావడంతో, ఎన్ని అవకాశాలు వచ్చినా కరోనా పేరు చెప్పి తిరస్కరించాను. రోజూ అయిదారు కాల్స్‌ వచ్చేవి. కొన్నాళ్లకు అవీ బ్లాక్‌ చేశాను. తెలుగు, కన్నడలోనే కాకుండా తమిళ, మలయాళ పరిశ్రమల నుంచీ అవకాశాలు వచ్చాయి. జీ తెలుగు వాళ్లు ఏ షో చేసినా ‘పార్వతిని మళ్లీ తీసుకురండి’ అంటూ అభిమానుల నుంచి మెసేజీలు, కామెంట్లు. ఆ ఒత్తిడి తట్టుకోలేక మరోసారి నాన్నను అడిగాను. స్నేహితులు, బంధువులు సర్దిచెప్పడంతో ఈసారి తేలిగ్గానే ఒప్పుకొన్నారు. ఆయనే స్వయంగా నాతో కూర్చుని ‘అగ్నిపరీక్ష’ కథ విన్నారు. ఓకే చెప్పారు. నాతోపాటు హైదరాబాద్‌ కూడా వచ్చారు. అలా నాన్నను ఒప్పించి మరోసారి మీ ముందుకొచ్చాను. మీ అందరి అభిమానం పొందుతున్నాను.

…? ప్రవళిక వేముల

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement