IND vs ZIM : నాకౌట్లో దక్షిణాఫ్రికా పంచ్‌తో సెమీస్ రేసులో వెనకబడిన భారత జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. చావోరేవో పోరులో చెపాక్ వేదికగా జింబాబ్వేతో టీమిండియా తలపడుతోంది. మైనస్ రన్‌రేటుతో ఉన్న భారత్.. ఆఫ్రికా జట్టును భారీ తేడాతో ఓడించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. వెస్టిండీస్ చేతిలో 107 పరుగులతో చిత్తుగా ఓడిన సికిందర్ రజా బృందం గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తగ్గపోరు ఖాయమనిపిస్తున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే సారథి బౌలింగ్ తీసుకున్నాడు.
గెలిస్తేనే సెమీస్ ఆశలు నిలిచే మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులు చేసింది. ఊహించినట్టే ఓపెనర్‌గా సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ బదులు అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. జింబాబ్వే ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. క్రెమన్ స్థానంలో మపోసా జట్టులోకి వచ్చాడు.
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
జింబాబ్వే తుది జట్టు : తడివనషే మరుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియన్ మైయర్స్, రియాన్ బర్ల్, సికిందర్ రజా(కెప్టెన్), టోనీ మున్యోంగ, తషింగ ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, మపోసా, ముజరబని, రిచర్డ్ నగవర.