– నలుగురు నిందితుల అరెస్ట్
చుంచుపల్లి, ఫిబ్రవరి 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు రూ.2.4 కోట్ల విలువైన 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులను నాగరాజు, మురళీధర్, తిరుపతి, ఎండ్ల రాము గా గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆదినారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చెన్నూరి శ్రీనివాసరావు, ఎస్ఐ రవి, రమాకాంత్ పాల్గొన్నారు.