Sand Mafia | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇసుకాసురుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా యధేచ్చగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో కాంగ్రెస్నాయకుల అక్రమ ఇసుక దందాకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలో అక్రమ ఇసుక తరలిస్తున్నారు.
అడవి సత్యారం వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మాగనూరు మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అక్రమంగా ఇసుకని తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నారాయణపేట చౌరస్తా వద్ద 4 టిప్పర్లను ఆపి పోలీసులకు సమాచారం అందించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోకుండా, పోలీసులు ఏం చేస్తున్నారని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
