తాండూర్ : మంచిర్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 జిల్లాస్థాయి బాలికల కబడ్డీ ( Kabaddi ) ఎంపిక పోటీలు సోమవారం తాండూర్ మండలం అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో జరిగాయి. ఈ ఎంపిక పోటీలలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 150 మంది విద్యార్థినీలు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన16 మందిని జోనల్( Zonal-Level ) కు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని క్రీడా సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీలకు సభా అధ్యక్షులుగా పాఠశాల హెచ్ఎం పీ ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాఠశాల పీడీ ఏ సాంబమూర్తి వ్యవహరించగా ముఖ్యఅతిథులుగా ఎంఈవో దుర్గం శ్రీనివాస్, సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకూబ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దాగం పాపయ్య, పోచయ్య, కొండు సాయి, విజయ్ కుమార్, గ్రామస్తులు, జిల్లాలోని వివిధ పాఠశాలల పీడీ, పీఈటి లు స్టీఫెన్ రవీంద్ర, నక్క విజయ్ చందర్ రావు, ప్రవీణ్, కుమార్, సదానంద, ఎం అశ్విని, తిరుమల, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.