రామగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తా హుస్సేన్ గురువారం నియామక పత్రం అందజేశారు. అంజిరెడ్డి ప్రస్తుతం యూనివర్సిటీలో సోషల్ సైన్స్ విభాగం డీన్ గా, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన యూనివర్సిటీలో పరీక్షల కంట్రోలర్‌గా, ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా, వీసీ ఓఎస్డీగా వివిధ హోదాల్లో పని చేశారు. రిజిస్టర్ గా నియామకమైన ఆయనకు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం సింగారం గ్రామం.