జీవో-97 రద్దు చేయాలని ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిస్టిబొమ్మను దహనం చేశారు.
- నవీపేట, కోటగిరిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
- నవీపేటలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నవీపేట/కోటగిరి, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిస్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఐటీఐ వృత్తి విద్య, డిప్లొమా సాంకేతిక విద్య, ఏటీసీ అడ్వాన్స్ సాంకేతిక విద్య అని, ఈ మూడు ఒకటి ఎలా అవుతాయని ప్రశ్నించారు.
ఐటీఐ విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. జీవో-97లో ఏమి ఉందో రేవంత్‌రెడ్డి సర్కార్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించేందుకు సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో పీడీఎస్‌యూ, డీఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్‌కుమార్, రేహాన్,ఆయాన్,బాల్‌రాజ్, జీవన్ రాథోడ్ ,సాయికుమార్, ఉదయ్, జాదవ్ ప్రణయ్, సామాజిక సేవ కార్యకర్త తోట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

