e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..


gongadi trisha | ఊహ తెలియని వయసులోనే ప్లాస్టిక్‌ బ్యాట్‌తో సిక్సర్లు బాదిన ఈ చిచ్చరపిడుగు.. పదహారేండ్ల ప్రాయంలో టీమ్‌ ఇండియా గడప తొక్కేందుకు తహతహలాడుతున్నది. తోటి వాళ్లంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, తాను మాత్రం రోజూ ఏడెనిమిది గంటలు నెట్స్‌లో చెమటోడుస్తున్నది. వయసుకు మించిన పరిణతితో దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ఆ నయా బుల్లెట్‌ పేరే… గొంగడి త్రిష ( gongadi trisha ). జాతీయ అండర్‌-19 వన్డే టోర్నీలో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఈ యువ సంచలనం.. సీనియర్‌ వన్డే చాలెంజర్‌ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నది. నేటి నుంచి విజయవాడ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్రిషతో స్పెషల్‌ చిట్‌చాట్‌..

గొంగడి త్రిష ( gongadi trisha )
గొంగడి త్రిష ( gongadi trisha )


మహిళల క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ లాంటిది మిథాలీ రాజ్‌. తనకు తరచూ నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తుంటా. హైదరాబాద్‌లో ఉంటే ఇద్దరం ఒకే దగ్గర ప్రాక్టీస్‌ చేస్తాం. ఆ సమయంలో మిథాలీ బౌలింగ్‌ ఆస్వాదిస్తా. సీనియర్‌ నేషనల్స్‌లోనూ కొన్నిసార్లు ఆమెకు ప్రత్యర్థిగా మ్యాచ్‌లు ఆడా. మిథాలీ ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తుంది. ఇటీవల అండర్‌-19 నేషనల్‌ టోర్నీలో నా ప్రదర్శనను క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభినందించడం ప్రత్యేకంగా అనిపించింది.

స్కెచ్‌ పెన్‌ల కథ

- Advertisement -

చిన్నప్పుడు ప్రాక్టీస్‌ బాగా చేసేందుకు నాన్న నాకు లంచం ఇచ్చేవారు. గ్రౌండ్‌లో నేను అలసిపోయినట్లు అనిపిస్తే.. ప్రాక్టీస్‌ బాగా చేస్తే స్కెచ్‌ పెన్‌లు, డ్రాయింగ్‌ బుక్స్‌ కొనిస్తానని చెప్పేవారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సాధన చేసేదాన్ని. ఒక్కోసారి ఐదొందల బంతుల వరకు ఎదుర్కొనేదాన్ని. కోచ్‌తో పాటు నాన్న కూడా బంతులు విసిరేవారు. వందలాది బంతులు ఎదుర్కోవడం వల్ల ఎంత లాభమో ఇప్పుడు అర్థమవుతున్నది.

అమ్మ చెప్పిందే తినాలి

ఎనిమిదేండ్ల వయసులోనే రాష్ట్ర అండర్‌-16 జట్టుకు ఎంపికయ్యా. అప్పటి నుంచి ఏదో ఒక స్థాయిలో రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. దీంతో ఆహారం విషయంలో చిన్నప్పటి నుంచే పరిమితులు ఉండేవి. టోర్నీల కారణంగా ప్రయాణాలు ఎక్కువ కావడంతో అమ్మ మాధవి నాతో పాటే ఉంటుంది. నా డైట్‌ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటుంది. అమ్మ చెప్పిందే తినాలి. కాదని చిరుతిండ్ల వైపు చూస్తే చురకలు తప్పవు.

గొంగడి త్రిష ( gongadi trisha )
గొంగడి త్రిష ( gongadi trisha )

ఫేవరెట్‌ ప్లేయర్‌

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అంటే ఇష్టం. చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో పాటు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున కరన్‌ ఆడిన మ్యాచ్‌లు చూస్తా. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా కనిపిస్తాడు. టీమ్‌ ఇండియా విషయానికి వస్తే శ్రేయస్‌ అయ్యర్‌ ఆట నచ్చుతుంది. న్యూజిలాండ్‌తో కాన్పూర్‌ టెస్టులో తను బ్యాటింగ్‌ చేసిన తీరు చాలా బాగుంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు.

సినిమాలకు దూరం

ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు వెళ్లలేకపోతున్నానని అప్పుడప్పుడు అనిపించినా.. క్రికెట్‌ కెరీర్‌ అంతకంటే ఎక్కువ ఆనందాన్నే ఇస్తుందన్న సంతృప్తి నా బాధను దూరం చేస్తున్నది. చిన్నప్పటి నుంచీ మైదానంలోనే ఎక్కువ సమయం గడపడంతో స్కూల్‌, కాలేజ్‌ లైఫ్‌ మిస్సయ్యా. నాలుగో తరగతి నుంచి కేవలం పరీక్షలకే పాఠశాలకు హాజరవుతున్నా. ఇంట్లో ట్యూషన్‌ పెట్టించుకుని పాఠాలను అర్థం చేసుకుంటా. ప్రస్తుతం భవన్స్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నా.

జట్టులో చోటే లక్ష్యం

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్‌ జరుగనుంది. దానికంటే ఒక నెల ముందు న్యూజిలాండ్‌తో టీమ్‌ ఇండియా ఒక టీట్వంటీ, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ
సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించనున్నారు. ఆ లోపు సీనియర్‌ చాలెంజర్‌ టోర్నీలో భారత్‌-
‘బి’ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసి టీమ్‌ ఇండియాకు ఎంపికవ్వాలనే లక్ష్యంతో ప్రాక్టీస్‌ చేస్తున్నా. ప్రస్తుతం విజయవాడలో క్వారంటైన్‌లో ఉన్నా. శనివారం తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

గొంగడి త్రిష ( gongadi trisha )
గొంగడి త్రిష ( gongadi trisha )

నాన్నే నా హీరో

ఎవరికైనా తండ్రే మొదటి హీరో. నా విషయంలో అది ఇంకాస్త ఎక్కువ. నా కోసం నాన్న జీవీ రామిరెడ్డి చాలా కష్టాలు పడ్డారు. దాదాపు రెండేండ్ల పాటు భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించారు. అక్కడ ఉంటే మెరుగైన శిక్షణ కష్టమని భావించి, నన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం నా కోచింగ్‌ కోసమే కేటాయిస్తున్నారు. ఆయన శ్రమ వల్లే ఈ స్థాయికి చేరుకున్నా. ఎప్పటికైనా భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనేది నాన్న కోరిక. ప్రస్తుతం, సీనియర్‌ చాలెంజర్స్‌లో రాణించి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా.

…? ఇంతియాజ్‌ మహమ్మద్‌

ఫొటోలు : గడసంతల శ్రీనివాస్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

rema rajeshwari | ఫోర్బ్స్‌ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్‌

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

నా పాట కోసం మా నాన్న‌ ఇంట్లో టీవీ కూడా అమ్మేసిండు

కొడుకు కోసం వెంటాడి మ‌రి చిరుత‌తోనే పోరాడింది

ఇంట్లో చెప్ప‌కుండానే న‌టించా.. సినిమా విడుద‌ల‌య్యాక నాన్న‌కు తెలిసి..

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement