Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Winter and Mustard : ఔషధ గుణాలను కలిగి ఉండి అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. చలికాలంలో ఆవాల వినియోగం మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది...

(Winter and Mustard) ఆవాలు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. ఆవాలను వంటల్లో వినియోగించడమే కాకుండా.. ఆకులను ఆకుకూరలు వండుతారు. ఆవాల నుంచి నూనె కూడా తయారవుతుంది. ఇది ఔషధ గుణాలను కలిగి ఉండి అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. చలికాలంలో ఆవాల వినియోగం మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది.
ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీసు, క్యాల్షియం అధికంగా లభిస్తాయి. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని కాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది. జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియాల్లో ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలు కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరం అని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పులను తగ్గించడంలో గ్రేట్‌గా సాయపడుతుంది.
అదుపులో కొలెస్ట్రాల్
సరికాని ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సమతులాహారం తీసుకోవాలి. శీతాకాలంలో ఖచ్చితంగా ఆహారంలో ఆవపిండిని చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సెలవిస్తున్నారు. చలికాలంలో ఆవపిండి వినియోగంతో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే, గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
బలపడనున్న రోగనిరోధక వ్యవస్థ
ఆవ ఆకులను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో విటమిన్-ఏ పుష్కలంగా లభిస్తుంది. చలికాలంలో తప్పనిసరిగా ఆహారంలో ఆవపిండిని చేర్చుకోవడం వల్ల విటమిన్ ఏ శరీరానికి లభించి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ
ఆవాలు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు నిత్యం ఆవాలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
తొలగిపోనున్న ఐరన్ లోపం
గర్భిణీల్లో ఐరన్ లోపం సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు ఎల్లప్పుడూ సూచిస్తుంటారు. వీటి వినియోగంతో ఇనుము లోపం తొలగిపోతుంది. గర్భిణీలు రోజూ ఆవాలు తీసుకోవడం ద్వారా కూడా ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
ఇంటర్ మూల్యాంకనం విధులకు ముఖం చాటేసిన ప్రైవేటు టీచర్లు
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
పేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం : డిప్యూటీ సీఎం ధర్మాన
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

