Rape on girl : బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
Rape on girl : అభం శుభం తెలియని 12 ఏండ్ల బాలికపై సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో జరిగిన...

శ్రీకాకుళం : (Rape on girl) గ్రామ ప్రజలకు అండగా నిలువాల్సిన వాలంటీర్లే.. రాక్షసులుగా తయారయ్యారు. అభం శుభం తెలియని 12 ఏండ్ల బాలికపై సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతున్నదని చెప్పడానికి ఈ ఘటనే సాక్షంగా నిలిచిందని చెప్పవచ్చు.
శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం నుడుకూరులో గ్రామ వాలంటీర్లుగా బొత్స హరిప్రసాద్, గుగ్గిలాపు రాంబాబు పనిచేస్తున్నారు. వీరితో జతకలిసిన మరో వ్యక్తి.. అక్కడికి సమీపంలోని ఓ ఇంట్లో 12ఏండ్ల బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించారు. తల్లిదండ్రులు ఊళ్లో లేరని తెలుసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహికంగా లైంగికదాడికి పాల్పడి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కుటుంబసభ్యులు వచ్చేసరికి అనారోగ్యానికి గురైన బాలకను నిలదీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాలంటీర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రోజున సచివాలయం మూసివేయాల్సి ఉండగా.. వాలంటీర్లు అక్కడే ఉండి ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నరు. వీరిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

