TSRTC Bus : బస్సు కోసం సీజేఐకి చిన్నారి లేఖ.. ఏర్పాట్లు చేసిన సజ్జనార్
TSRTC Bus : తన సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోయింది. ఆయన ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో.. వెంటనే...

హైదరాబాద్ : (TSRTC Bus) బడికి వెళ్లేందుకు ఆ చిన్నారి చాలా కష్టపడుతున్నది. స్కూల్‌కు వెళ్లాలంటే బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నది. తన సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోయింది. ఆయన ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆ చిన్నారి కోరిక తీర్చి హాయిగా బస్సెక్కి బడికి పోయేలా చేశారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతున్నది. 9 వ తరగతి చదివే తమ్ముడితో కలిసి నిత్యం 6 కిలో మీటర్ల దూరంలోని స్కూల్‌కు వెళ్తున్నారు. అయితే, వీరి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వీరిద్దరూ స్కూల్కెళ్లేందుకు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటర్ చదువుతున్న వీరి అక్క కూడా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి వస్తున్నది. ఆమె కూడా బస్సు లేక ఆటోలో వెళ్తూ ఇబ్బంది పడుతున్నది. తండ్రి ఇటీవల కరోనాకు గురై గుండెపోటుతో చనిపోయాడు. తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఈ దశలో నిత్యం ఆటోలకు రూ.150 వరకు చెల్లించే స్థోమత లేని ఈ చిన్నారులు.. చదువు మానుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
అయితే, చదువుకు ఫుల్స్టాప్ పెట్టే బదులుగా సమస్యను పరిష్కరించుకోవాలని యోచించిన చిన్నారి వైష్ణవి.. తమతో పాటు ఇతర విద్యార్థులు పడుతున్న కష్టాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రూపంలో తెలిపింది. కరోనా లాక్డౌన్ విధించడానికి ముందు చీదేడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. ఈ బస్సును తిరిగి పునరుద్దరించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆయన ఆ ఉత్తరాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు పంపి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చీదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్దరించారు. ఎప్పటిమాదిరిగా బస్సులు నడుస్తుండటంతో స్కూల్కెళ్లి బాగా చదువుకోవచ్చని ఆ చిన్నారి సంతోషం వ్యక్తం చేసింది. తమకు సహకరించిన ఎన్వీ రమణతోపాటు సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు : ఐఓసీ
మూడో రోజు కొనసాగిన రైతుల మహా పాదయాత్ర
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

