MP Suresh : బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
MP Suresh : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధ ఘన విజయం సాధించి ఒక్క బీజేపీనే కాకుండా.. అటు టీడీపీని, ఇటు జనసేనను కూడా ఘోరంగా...

కడప : (MP Suresh) బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధ ఘన విజయం సాధించి ఒక్క బీజేపీనే కాకుండా.. అటు టీడీపీని, ఇటు జనసేనను కూడా ఘోరంగా ఓడించారని ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. ఓటమి తప్పదన్న భయంతోనే ఆ రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి రాలేదని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థికి ఈ రెండు పార్టీలు బయటి నుంచి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని, ఇది జగన్ ప్రజాపానలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా చంద్రబాబు తెర వెనుక ఉంటూ బీజేపీకి 20వేల ఓట్లు వేయించారని ఆరోపించారు. బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘వైసీపీని చూస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతున్నది. అందుకే కుప్పంలో ఉండమంటారా? వద్దా? అని తన నియోజకవర్గ ప్రజలను అడిగే స్థాయికి చేరుకున్నారు. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర ద్వారా తిరుపతి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ పాదయాత్రలో ఏదైనా అనుకోనిది జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని ఎంపీ సురేశ్ వ్యాఖ్యానించారు. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 90, 533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇవి కూడా చదవండి..
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

