Heart attack @ Winter : శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
Heart attack @ Winter : వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ...

(Heart attack @ Winter) వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. చలి ఎక్కువైతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుదలతో పాటు స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ ప్రకారం, ఊబకాయం, సిగరెట్ స్మోకింగ్ అలవాటు, అధిక రక్తపోటు ఉన్నవారికి స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువ. అమెరికా సీడీసీ ప్రకారం, రక్తపోటు ఎక్కువగా ఉంటే అది గుండెకు హాని కలిగించడమే కాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
20:30:40 సూత్రాన్ని ఆచరిద్దాం..
శీతాకాలంలో గుండె ప్రమాదాలను తగ్గించుకోవడానికి ఎన్నో సూచనలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయడం వంటివి ముఖ్యమైనవి. వీటని ఆచరించడం ద్వారా చలికాలంలో స్ట్రోక్, హార్ట్ అటాక్ నుంచి బయటపడొచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
20 నిమిషాల సూర్యకాంతి
రోగనిరోధక వ్యవస్థ ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీలను తయారు చేస్తుంది. సూర్యరశ్మి కారణంగా శరీరం ఈ యాంటీబాడీలను ఎక్కువగా తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి.
30 శాతం ప్రోటీన్
సూర్యకాంతి ద్వారా విడుదలయ్యే సెరోటోనిన్ అనే హార్మోన్, కార్బోహైడ్రేట్లను కూడా విడుదల చేస్తుంది. శీతాకాలంలో సూర్యకాంతి తీవ్రత తక్కువగా ఉన్న కారణంగా ఆకలి భావన ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ను తగ్గిస్తుంది. ఆహారంలో తీసుకునే క్యాలరీల్లో 30 నుంచి 35 శాతం ప్రొటీన్ల నుంచి వస్తే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.
40 నిమిషాల వ్యాయామం
చలికాలంలో ప్రతీ రోజు 40 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అధిక రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం 27 శాతం తగ్గుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, సైకాలజీ, న్యూరోసైన్స్ ప్రకారం, రోజుకు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేసే వ్యక్తులు డిప్రెషన్ ప్రమాదాన్ని 28 శాతం తక్కువ కలిగి ఉంటారు.
శీతాకాలంలో పెరిగే ప్రమాదాలు..
- మేయో క్లినిక్ ప్రకారం, శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఈ కారణంగా రక్తపోటు పెరుగుతుంది.
- అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. ఈ గడ్డ మెదడుకు రక్తం వెళ్లడానికి ఆటంకం కలిగిస్తుంది.
- న్యూయార్క్ మౌంట్ సినాయ్ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి..
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

