Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
Narayana Swamy : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఊహించని షాక్ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఒక శాఖను...

అమరావతి : (Narayana Swamy) ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఊహించని షాక్ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఒక శాఖను చెప్పాపెట్టకుండా ప్రభుత్వం తప్పించింది. ఆయనను కేవలం ఒక శాఖకే పరిమితం చేసింది. దాంతో ఒక్క శాఖనైనా ఇచ్చారని సంతోషించాలో.. అసలైన శాఖను లాక్కొన్నారని బాధపడాలో తెలియని అయోమయంలో ఆయన పడిపోయారు. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ పరిధిలోకి వాణిజ్య పన్నుల శాఖ వచ్చినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ఏపీ ప్రభుత్వం భావించింది. అప్పట్లో దీనిపై పలు అభ్యంతరాలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పడు చేసిన ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆదివారం గెజిట్ విడుదల చేసింది సర్కార్. త్వరలో మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే వాణిజ్య పన్నుల శాఖను డిప్యూటీ సీఎం నుంచి తప్పించినట్లు వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
ఇకపై జూలై 18 తమిళనాడు దినం : ప్రకటించిన సీఎం స్టాలిన్
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

