వరంగల్ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ప్రాంగణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు చేరుకున్నారు. సంతాప సభలో పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా సాగిన పోరాటం, తెలంగాణ అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే గా పెద్ది చేసిన శాశ్వత పనులపై చేసిన డాక్యుమెంట్ ప్రదర్శన పలువురిని కంటతడి పెట్టించింది. డాక్యుమెంటరీ చూసి పెద్ది భార్య స్వప్న కన్నీరుమున్నీరైంది.
కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత సిరికొండ, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, గండ్ర సహా పలువురు నేతలు హాజరయ్యారు.
సంతాప సభలో కన్నీరుమున్నీరైన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న https://t.co/iXz7xHIOjO pic.twitter.com/pqD4MGDIz1
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026