AP Weather : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
AP Weather : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి 48 గంటల్లో..

విజయవాడ : (AP Weather) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అదేవిధంగా కోస్తా, ఆంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు పడనున్నాయి. తీరం వెంబడి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకవాశం ఉన్నదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 4 .5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని దగ్గర ఉన్న భూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము-సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 .1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
పేదలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటాం : డిప్యూటీ సీఎం ధర్మాన
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

