Mahapadayatra : ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
Mahapadayatra : రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతున్నది. ఆరో రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు...

గుంటూరు : (Mahapadayatra) రాజధాని రైతులు, మహిళల మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతున్నది. ఆరో రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రారంభమైంది. ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ దాదాపు 14 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర జరుగనున్నది. మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లా నేతలు, రైతులు సాదర స్వాగతం పలికారు. మహాపాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు గ్రామస్తులు బూట్లు, గొడుగులు అందించి సంఘీభావం తెలిపారు.
రాజధాని కోసం వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, గ్రామస్తులు పాదపూజ నిర్వహించారు. రైతుల పాదాలపై పూలు చల్లి పూజలు చేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 150 మంది రైతులకు బూట్లు, గొడుగులు అందించారు. ప్రజలు చూపించిన ఈ అభిమానంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రాజధాని రైతులకు మద్దతు కోసం బయలుదేరి వెళ్లారు.
అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థాననం మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 12 రోజులపాటు యాత్ర సాగనున్నది. రెండు రోజులు విశ్రాంతి కోసం మార్గంమధ్యలో రైతులు ఆగనున్నారు. పర్చూరు మండలం చిన నందపాడులో మహాయాత్ర ప్రవేశించింది. తొలిరోజు చిననందిపాడు నుంచి అడుసుమల్లి, పర్చూరు వరకు యాత్ర ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

