Praja Sankalpa Yatra : ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
Praja Sankalpa Yatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి ఇవాల్టికి నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని..

గుంటూరు : (Praja Sankalpa Yatra) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి ఇవాల్టికి నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కొశారు. మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం జగన్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్న పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల ఇబ్బందులనే మానిఫెస్టోగా మార్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. పరిపాలనా ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్న లక్ష్యంతోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.
ఏపీలో 341 రోజుల పాటు కొనసాగించిన తన ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేండ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది’ అని సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

