pneumonia | పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
world pneumonia day | న్యుమోనియా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఐదేండ్లు నిండని చిన్నారుల మరణాలలో 16 శాతం దీని వల్లనే. న్యుమోనియా చావులు అతిసార మరణాల కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇది ప్రమాదకరమైన సమస్యే అయినా, రుగ్మతకు గురైన ఐదు కుటుంబాలలో ఒకరికి మాత్రమే వ్యాధి పట్ల అవగాహన ఉంటున్నది. సగం మందికి కూడా సరైన చికిత్స లభించడం లేదు.

న్యుమోనియా.. ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే చివరి నాళాలు.. ‘బ్రాంకి యోల్స్’, ‘అల్వియాలై’ అనే చిన్న సంచి ఆకారంలోని భాగాలకు చేరుకుంటాయి. అల్వియాలైలోని నాళాలలో ప్రవహించే రక్తం, గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరించి, కార్బన్ డై ఆక్సైడ్‌ను విసర్జిస్తుంది. న్యుమోనియాతో అల్వియాలైలో చీము, ఇతర ద్రవాలు చేరడం వల్ల ప్రాణవాయు స్వీకరణ తగ్గిపోతుంది.
కారణాలు అనేకం..
ఈ వ్యాధి బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఫంగస్, వివిధ రసాయనాల వల్ల కూడా రావచ్చు. బ్యాక్టీరియాలో ప్రధానమైనవి.. స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా, హెచ్. ఇన్‌ప్లుయెంజా, స్టఫైలోకాకస్. వైరస్లలో ప్రధానమైనవి.. ఆర్ఎస్వి, ఇన్‌ప్లుయెంజా.
లక్షణాలు ఇవీ..
బ్యాక్టీరియా వల్ల వస్తే న్యుమోనియా లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమై, తీవ్రంగా ఉంటాయి. ముక్కు కారడం, జ్వరం, చలి, తల, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి, దగ్గు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు.. ప్రారంభ దశలో కనిపిస్తాయి. సరైన వైద్యం లభించనప్పుడు వ్యాధి ముదిరి ఆయాసం వస్తుంది. చివరి దశలో స్పృహ కోల్పోవడం, ఫిట్స్ వంటి లక్షణాలూ బయటపడతాయి.
వ్యాప్తి
దగ్గు, తుమ్ముల వల్ల సూక్ష్మజీవులు లాలాజల బిందువుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. న్యుమోనియా వర్ష కాలం, చలికాలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తల్లిపాలు తాగనివారికి, పోషకాహార లోపాలు ఉన్నవారికి, గవదబిళ్లలు లాంటి వైరస్ రుగ్మతలు వచ్చినవారికి, కిక్కిరిసిన నివాసాలలో ఉండేవారికి, పొగ అలవాటు ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ వ్యాధి తరచుగా వస్తుంది.
వైద్యం
సకాలంలో సంపూర్ణమైన వైద్యం లభించకపోతే మరణానికి దారి తీయవచ్చు. ముఖ్యంగా రెండు నెలలలోపు వయసు కలిగి, పోషకాహార లోపాలతో బాధపడుతున్న శిశువుల్లో తీవ్రత ఎక్కువ. బిడ్డల్లో శ్వాసక్రియ వేగాన్ని బట్టి వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. తల్లిపాలు, టీకాలు, పోషక విలువలున్న ఆహారం.. పిల్లలను న్యుమోనియా నుంచి కాపాడతాయి. పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం. వ్యాధి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pneumonia ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

