జేఎన్టీయూహెచ్లో ‘నీలిట్’ కేంద్రం
సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు జేఎన్టీయూహెచ్ కీలక అడుగేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు జేఎన్టీయూహెచ్ కీలక అడుగేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. నీలిట్తో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్నది. డిల్లీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీకేకేరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి, నీలిట్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్కే దురంధర్, ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు ప్రభ తదితరులు పాల్గొన్నారు. నీలిట్ సెంటర్ ఏర్పాటుతో ఏఐ, సెమికండక్టర్, వీఎల్ఎస్ఐ డిజైన్, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ భద్రత, ఐవోటీ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

