వేధిస్తున్న భర్తను కర్రతో కొట్టి హత్య
వేధిస్తున్న భర్తను భార్య కర్రతో కొట్టి హతమార్చింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నర్సాపురం గ్రామానికి చెందిన మొరంపూడి సూరిబాబు (44), రమణ దంపతులు కొండాపూర్లోని మసీదుబండ సీఎంసీ లే అవుట్లోని నిర్మాణ స్థలంలో నివాసముంటూ పనిచేస్తున్నారు.
శేరిలింగంపల్లి, నవంబర్ 16: వేధిస్తున్న భర్తను భార్య కర్రతో కొట్టి హతమార్చింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నర్సాపురం గ్రామానికి చెందిన మొరంపూడి సూరిబాబు (44), రమణ దంపతులు కొండాపూర్లోని మసీదుబండ సీఎంసీ లే అవుట్లోని నిర్మాణ స్థలంలో నివాసముంటూ పనిచేస్తున్నారు. సూరిబాబు తరచూ తాగొచ్చి..
భార్య రమణను వేధించేవాడు. విసిగిపోయిన ఆమె అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల మద్యం మత్తులో సూరిబాబు గొడవపడి భార్యను కొట్టాడు. రమణ అతడిని తోసివేయగా కిందపడిపోయాడు. అనంతరం నిర్మాణ పనులకు ఉపయోగించే చెక్క కర్రతో కొట్టడంతో భర్త సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా వైద్యశాలలో చికిత్స పొందుతూ.. ఈ నెల 11న మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

