Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Health Tips | సాధారణంగా కూరల్లో సువాసన కోసం కరివేపాకు వేస్తారు. కానీ ఈ కరివేపాకును తినేవాళ్లు తక్కువగా ఉంటారు. చాలామంది కూరలో కరివేపాకు కనిపించగానే తినకుండా పక్కకు పెడుతారు. ఎక్కువ మంది ఇలా కరివేపాకును తీసిపారేస్తారు కాబట్టే.. ఎవరినైనా లెక్కచేయకపోతే 'నన్ను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు' అంటూ వాపోతారు.
Curry leaves : సాధారణంగా కూరల్లో సువాసన కోసం కరివేపాకు వేస్తారు. కానీ ఈ కరివేపాకును తినేవాళ్లు తక్కువగా ఉంటారు. చాలామంది కూరలో కరివేపాకు కనిపించగానే తినకుండా పక్కకు పెడుతారు. ఎక్కువ మంది ఇలా కరివేపాకును తీసిపారేస్తారు కాబట్టే.. ఎవరినైనా లెక్కచేయకపోతే ‘నన్ను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు’ అంటూ వాపోతారు. కానీ కరివేపాకును పారవేయద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దానిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పలు సమస్యలకు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి కరివేపాకుతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం..
ప్రయోజనాలు..
కరివేపాకుకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉన్నది. అందుకే ఆహారంలో తరచూ కరివేపాకు వాడటంవల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి లను సరఫరా చేస్తుంది.
రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల కరివేపాకును తరచూ తీసుకుకోవడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చు.
కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంతో కూడా తోడ్పడుతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అంతేకాదు కరివేపాకు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. కరివేపాకులో మెదడుతోపాటు నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే పదార్థాలు చాలా ఉంటాయి.
కరివేపాకుతోపాటు దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది.
కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి పరిష్కారం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | కూరల్లో వేసే ఈ ఆకు ఆరోగ్యానికి దివ్యౌషధం.. తినేటప్పుడు తీసిపారేయకండి..!
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Nasal Congestion | చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

