Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
Teen Tigada | ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపనతో పాటు యంగ్ ఏజ్‌లో ఎదురయ్యే ఊహించని మలుపులు, భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ‘టీన్ తిగడా’.
Teen Tigada | ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపనతో పాటు యంగ్ ఏజ్‌లో ఎదురయ్యే ఊహించని మలుపులు, భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ‘టీన్ తిగడా’. సంగీతం మరియు క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ప్రేక్షకులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. స్ట్రీట్ల్యాంప్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ, ఐ స్క్రీమ్ డ్రీమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించాయి. ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ, అర్చిక అరోరా, సమర్థ్ మెహతా, గ్రుషా కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ ట్రైలర్ యువత జీవితాలు, వారి కలలు, ఆశయాలను కళ్లకు కట్టేలా అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. అస్మాని అనే యువతి క్రికెటర్ కావాలని కలలు కంటుంటే, మానస్ అనే యువకుడు సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో వారు ఊహించని విధంగా తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం తెలుస్తుంది. ఈ అనూహ్య పరిణామం వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. ఓవైపు తమ కలలు, మరోవైపు ప్రేమ, మరోవైపు కొత్తగా ఎదురైన బాధ్యతలు వంటి ఎన్నో సవాళ్ల మధ్య ఈ జంట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? వారి భవిష్యత్తు ఎలా మారింది? అనేది ఈ సిరీస్‌లో అత్యంత ఆసక్తికరంగా చూపించనున్నారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా నటి ప్రసన్న బిష్ట్ మాట్లాడుతూ, ఈ కథ చాలా సహజంగా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తెరకెక్కిందని తెలిపారు. మనం ఆశించినట్లు జీవితం సాగనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఇందులో చూపించామని, ముఖ్యంగా యువత ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రేమ, కామెడీ, సరదా సన్నివేశాలు, ఊహించని మలుపులతో ఈ సిరీస్ ఉంటుందని వెల్లడించారు.
అలాగే నటుడు దనేష్ రజ్వీ మాట్లాడుతూ, యువతలో ఉండే ప్రేమ, ఆశయాలు, జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుందని తెలిపారు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషుల మధ్య సంబంధాలు ఎలా మారుతాయి, ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనే అంశాలను ఇందులో అద్భుతంగా ఆవిష్కరించామని చెప్పారు. సరదా సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా ఇందులో మంచి ప్రాధాన్యత ఉందని, నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teen Tigada | ఆకట్టుకుంటున్న ‘టీన్ తిగడా’ వెబ్ సిరీస్ ట్రైలర్.. నవంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Nasal Congestion | చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

