Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాట విడుదల!
Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా ‘మైసా’పై రోజురోజుకూ భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా ‘మైసా’పై రోజురోజుకూ భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ మరియు హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్ మరియు మొదటి పాట ‘ఓ మైసా రే’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాటకు పూర్తి భిన్నంగా, తండ్రి కూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాన్ని కళ్లకు కట్టేలా రెండో పాట ‘ఏనాటి వరమో నువ్వు’ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. చక్కని మధురమైన బాణీలు, హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో రూపొందిన ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ పాటకు అత్యద్భుతమైన మెలోడీని అందించారు. వినసొంపైన ట్యూన్‌తో పాటు శ్రోతలను కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ను ఆయన తన సంగీతంతో పలికించారు. ఇక గాయకుడు కృష్ణ తేజస్వి తన మధురమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు. ప్రతిభావంతులైన గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్య విలువలు పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక తండ్రికి తన కూతురిపై ఉండే నిస్వార్థమైన ప్రేమ, అపారమైన ఆప్యాయతను ఈ పాటలోని ప్రతీ పదం ఎంతో చక్కగా వివరించింది. మానవ సంబంధాలలో అత్యంత పవిత్రమైన తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఈ గీతం అద్భుతంగా ఆవిష్కరించింది.
ఈ పాటలో నాయిక మైసా చిన్ననాటి రోజులను అందంగా కళ్లకు కట్టారు. చిన్నతనం నుంచే ఎంతో ధైర్యంగా, సాహసాలు చేయడానికి ఇష్టపడే అమ్మాయిగా మైసా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండటం, చెట్లు ఎక్కడం వంటి చురుకైన సన్నివేశాలతో ఆమె వ్యక్తిత్వం హైలైట్ అవుతుంది. తండ్రిపై తనకు ఉన్న అమితమైన ప్రేమకు గుర్తుగా ఆయన రూపంలో టాటూ వేయించుకోవాలనుకోవడం ఈ పాటలోని అత్యంత భావోద్వేగ సన్నివేశంగా నిలుస్తుంది. రష్మిక చిన్ననాటి పాత్రలో నటిస్తున్న ఈ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో ప్రముఖ నటులు సముద్రఖని మరియు ఈశ్వరీ రావు నటించారు. వీరిద్దరి అనుభవజ్ఞులైన నటన ఈ భావోద్వేగ సన్నివేశాలకు మరింత సహజత్వాన్ని, జీవాన్ని తెచ్చిపెట్టింది. మొదటి పాటలో చూపించిన పవర్ఫుల్ యాక్షన్ ప్రపంచానికి పూర్తి విరుద్ధంగా, ‘ఏనాటి వరమో నువ్వు’ పాట సినిమాలోని బలమైన ఎమోషనల్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. మంచి మెలోడీ, అద్భుతమైన సాహిత్యం, కుటుంబ బంధాలను ప్రతిబింబించే సన్నివేశాలు ఈ పాటను వెంటనే అందరికీ నచ్చేలా చేస్తున్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత తారాస్థాయికి చేరాయి.
ఈ భారీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్రేయాస్ పి. కృష్ణ వ్యవహరిస్తుండగా, జేక్స్ బిజోయ్ తనదైన సంగీతంతో మ్యాజిక్ చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఈ చిత్రంలోని సాహసోపేతమైన స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రష్మిక మందన్నతో పాటు ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాట విడుదల!
Rudrabhishekam | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల ఆవుపాలతో రుద్రాభిషేకం
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

