Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Baljor Singh | సాధారణంగా మనిషి మరణించిన పదో రోజున అతడు లేదా ఆమె సంతానం కర్మకాండలు జరిపిస్తారు. కానీ ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం బతికుండగానే తన కర్మకాండలను తానే జరుపుకున్నాడు. అదీ సాదాసీదాగా కాదు, ఏకంగా 900 మంది బంధుమిత్రులను పిలిచి ఆడంబరంగా కర్మకాండలు చేసుకున్నాడు.
Baljor Singh : సాధారణంగా మనిషి మరణించిన పదో రోజున అతడు లేదా ఆమె సంతానం కర్మకాండలు జరిపిస్తారు. కానీ ఓ 80 ఏళ్ల వృద్ధుడు మాత్రం బతికుండగానే తన కర్మకాండలను తానే జరుపుకున్నాడు. అదీ సాదాసీదాగా కాదు, ఏకంగా 900 మంది బంధుమిత్రులను పిలిచి ఆడంబరంగా కర్మకాండలు చేసుకున్నాడు. ఉత్తర్ప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పత్ జిల్లా జోహ్రి ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల బల్జోర్ సింగ్కు కొడుకులు లేరు. ఒక్కతే కూతురు పింకీ ఉంది. పింకీకి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు. ఆమె కష్టపడి తన పిల్లలను పోషించుకుంటున్నది. ఈ క్రమంలో కూతురికు ఉన్న బాధ్యతలతోపాటు తాను కూడా ఓ బరువు కాకూడదని బల్జోర్ సింగ్ భావించాడు. అందుకే బతికుండగానే తన సొంత ఖర్చుతో కర్మకాండలు చేసుకుంటే కూతురుకు ఖర్చు తప్పుతుందనే నిర్ణయానికి వచ్చాడు.
నిర్ణయం తీసుకునుడే ఆలస్యం తన కర్మకాండలకు ముహూర్తం ఖరారు చేశాడు. బంధుమిత్రులను పిలిచి కర్మకాండలు జరుపుకున్నాడు. దాదాపు 900 మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరణానంతరం తాను తన కూతురుకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని కర్మకాండల అనంతరం బల్జోర్ సింగ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
‘చేయూత పెన్షన్దారులకు న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

