Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Lawyer remarks at CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌పై ఒక న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’ అని అతడు అన్నాడు. ఈ నేపథ్యంలో ఆ లాయర్‌ను కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌పై ఒక న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’ అని అతడు అన్నాడు. ఈ నేపథ్యంలో ఆ లాయర్‌ను కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ వాగ్వాదం తర్వాత కోర్టు విచారణతో పాటు ఆడియో, వీడియో ఫీడ్‌ను నిలిపివేశారు. (Lawyer remarks at CJI) లైవ్‌లా నివేదిక ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జయమాల్య బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనాన్ని ఒక న్యాయవాది సంప్రదించాడు. సాధారణ ప్రక్రియకు భిన్నంగా తన విషయాన్ని లేవనెత్తినందుకు ఆయన క్షమాపణలు చెప్పాడు. తనపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని న్యాయమూర్తులను కోరాడు.
కాగా, నవంబర్ 2న ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఆ పత్రాలను తాను సమర్పించినట్లు ఆ న్యాయవాది తెలిపాడు. ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అన్నాడు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాలని ఆయన పట్టుబట్టాడు. దీంతో ‘మేము చూస్తాము, మీరు వేచి ఉండండి’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆ న్యాయవాదితో అన్నారు.
అయితే వేచి ఉండేందుకు ఆ న్యాయవాది నిరాకరించాడు. ‘మీరు ఆ కుర్చీలో కూర్చోలేరు. మీకు ఆ అర్హత లేదు. దానికి కావలసిన నిజాయితీ మీకు లేదు’ అని ఆ న్యాయవాది అన్నట్లు లైవ్‌లా పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో ఫీడ్‌ను నిలిపివేశారు. అలాగే ఆ న్యాయవాదిని బయటకు పంపివేశారు. ఆయన ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కొందరు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు తెలుస్తున్నది. గతంలో కూడా కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను దూషించడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CJI Surya Kant
- Escorted
- lawyer
- out
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

