Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Rajigadu Rajayyadu | 'బట్టల రామస్వామి బయోపిక్కు' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు అల్తాఫ్ హసన్ ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నారు.
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు అల్తాఫ్ హసన్ ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నారు. హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజిగాడు రాజయ్యాడు’. శర్మాస్ ఫిలింస్ పతాకంపై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్తాఫ్ హసన్ సరసన అను శ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డాక్టర్ గోరటి వెంకన్న ఒక అత్యంత కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేలా ఉంది. ఒక ప్రాచీన గఢీ బయట, హీరో ఒంటిపై గాయాలతో ఒక పంది పిల్లను చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్న తీరు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. చుట్టుపక్కల కుల వృత్తులకు సంబంధించిన పనిముట్లు ఉండటం గ్రామీణ నేపథ్యాన్ని, నైటివిటీని ప్రతిబింబిస్తోంది. ఆ పెద్ద గఢీలోని వారికీ హీరోకూ మధ్య ఎలాంటి సంబంధం ఉంది?, పంది పిల్లను ఆయన చేతిలో ఎందుకు పట్టుకున్నారు?, ఆయన ఒంటిపై గాయాలు కావడానికి, గొడవలకు అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలతో ఈ పోస్టర్ ప్రేక్షకులలో తీవ్రమైన క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సినిమా టైటిల్లోనే అచ్చమైన తెలంగాణ నేటివిటీ ఉట్టిపడుతుండగా, అసలు “రాజిగాడు” ఎవరు? అతను “రాజయ్యాడు” ఎలా అయ్యాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రాబోతోంది.
ఈ చిత్రంలో అల్తాఫ్ హసన్, అను శ్రీ, డా. గోరటి వెంకన్నలతో పాటు గీతా అగర్వాల్, రాజేంద్ర మోహన్ నను, శ్రీవర్ధన్ త్రివేది, సుజాత దీక్షిత్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్ గౌడ్, డా. శివకుమార్ కాముని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథాచిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Nasal Congestion | చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాట విడుదల!
Rudrabhishekam | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల ఆవుపాలతో రుద్రాభిషేకం
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

