AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
AP News | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన వాయుగుండం అంతకంతకే బలపడుతున్నది. తీవ్ర వాయుగుండంగా మారి క్రమంగా ఏపీ తీరంవైపు దూసుకొస్తున్నది. ఈ తీవ్ర వాయుగుండం రేపు (మంగళవారం) తుపానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
AP News : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన వాయుగుండం అంతకంతకే బలపడుతున్నది. తీవ్ర వాయుగుండంగా మారి క్రమంగా ఏపీ తీరంవైపు దూసుకొస్తున్నది. ఈ తీవ్ర వాయుగుండం రేపు (మంగళవారం) తుపానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎండీ.. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), దక్షిణ ఒడిశా (South Odisha) తీర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
గడిచిన ఆరు గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలిన తీవ్ర వాయుగుండం.. ఇప్పుడు శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 620 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది మరింత బలపడి నవంబర్ 16 సాయంత్రానికి తుపానుగా, నవంబర్ 17న సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుంది.
అనంతరం ఈ తుపాను మరింత తీవ్రరూపం దాల్చి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నవంబర్ 20న మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ఈ తుపాను ప్రభావంతో నవంబర్ 18 నుంచి కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి.
నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడా 21 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో నవంబర్ 19, 20 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చు. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో నవంబర్ 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు, నవంబర్ 21న పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రేపు తుపానుగా మారనున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్..!
Rajigadu Rajayyadu | ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఫేమ్ అల్తాఫ్ హసన్ దర్శకత్వంలో ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Nasal Congestion | చలికాలంలో ముక్కు దిబ్బడ సమస్య ఎందుకు ఎక్కువవుతుంది.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాట విడుదల!
Rudrabhishekam | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల ఆవుపాలతో రుద్రాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

